‘ఖుషీ’ కాంబినేషన్ రిపీట్ అయ్యేనా?

by  |
‘ఖుషీ’ కాంబినేషన్ రిపీట్ అయ్యేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇళయ దళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమా టీజర్.. రికార్డులు బద్ధలు కొడుతూ సోషల్ మీడియా ట్రెండింగ్‌లో నిలిచినట్లే, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ దర్శకుడి డైరెక్షన్‌లో ఉంటుందనే విషయంపైనా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇంతకు ముందు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ తన తదుపరి చిత్రం ఉండబోతుందని వార్తలు రాగా.. ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ ఆ బాధ్యత తీసుకుంటారనే న్యూస్ స్ప్రెడ్ అయింది. కానీ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఖుషీ మెగాహిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుందని కోలీవుడ్ టాక్. అంటే తమిళ్‌లో విజయ్‌తో ఖుషీ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ ఎస్.జె.సూర్య.. ఇప్పుడు విజయ్ తదుపరి చిత్రానికి కెప్టెన్ ఆఫ్ ది షిప్ అన్నమాట. ఈ వార్తతో విజయ్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతుండగా.. ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది తెలియాల్సి ఉంది. కాగా త్వరలోనే విజయ్ నెక్స్ట్‌ మూవీ‌పై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

కాగా విజయ్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ‘మాస్టర్’ టీజర్ యూట్యూబ్‌లో రెండు రోజుల్లోనే రెండు మిలియన్ లైక్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో ఎక్స్‌‌‌‌బీ ఫిల్మ్ క్రియేటర్స్ నిర్మించిన సినిమా విడుదలపై త్వరలో ప్రకటన వెలువడనుంది. మాళవిక మోహన్ హీరోయిన్ కాగా, అనిరుధ్ రవిచంద్రన్ అందించిన మ్యూజిక్ ఆల్బమ్ సూపర్ హిట్ అయింది.


Next Story

Most Viewed