మందు బాటిలే మంచినీటి బాటిల్.. అర్జున్ రెడ్డి టిప్

by  |
మందు బాటిలే మంచినీటి బాటిల్.. అర్జున్ రెడ్డి టిప్
X

దర్శకుడు కొరటాల శివ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు #betheREALMAN చాలెంజ్ విసిరారు. కానీ సార్… మా మమ్మీ ఇంట్లో నన్ను పనిచేయనీయట్లే… అలా చేస్తే డబుల్ వర్క్ అవుతుందట… ఇంట్లో ఇంకా మమ్మల్ని రియల్ మెన్ లా చూడట్లేదు… పిల్లల్లానే చూస్తున్నారు… కానీ లాక్ డౌన్ లో నేను ఏం చేస్తున్నానో చూపిస్తా అంటూ తెలిపిన విజయ్… చాలెంజ్ లో భాగంగా వీడియో షేర్ చేశాడు. బిట్స్ ఆఫ్ మై లాక్ డౌన్ అంటూ వీడియో పోస్ట్ చేసిన విజయ్… ఫ్యాన్స్ కు టిప్స్ కూడా ఇచ్చాడు.

టిప్ 1. ఆల్కహాల్/ వైన్ బాటిల్స్ ను వాటర్ బాటిల్స్ గా వినియోగించుకోవచ్చు

టిప్ 2. ఉదయాన లేవగానే 1 లీటర్ మంచి నీరు తాగాలి

టిప్ 3. పాత కవర్లను డస్ట్ బిన్ కవర్స్ గా యూజ్ చేయొచ్చు

ఇక చాలెంజ్ లో భాగంగా మ్యాంగో ఐస్ క్రీం తయారు చేశాడు విజయ్. తల్లి, తమ్ముడికి అందించి రియల్ మెన్ గా ఉండాలని సూచించారు. నా డాడీ రియల్ మెన్ అని చెప్పిన విజయ్… ఈ భూమి మీద మిమ్మల్ని ప్రేమించే వాళ్లతో ఉన్నప్పుడు విపత్కర పరిస్థితిలో కూడా ఆనందంగా ఉండొచ్చని సూచించాడు. ఈ సమయంలో ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ… శుభ్రంగా, సంతోషంగా ఉండాలని సూచించాడు విజయ్. ఆనంద్ దేవరకొండ ఈ వీడియో డాక్యుమెంట్ చేసినట్లు తెలిపిన … మాలీవుడ్ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ ను #betheREALMAN చాలెంజ్ కు నామినేట్ చేశాడు విజయ్.

ఈ వీడియో పై స్పందించిన కొరటాల… ఇలాగే పని చేస్తూ వీడు పిల్లోడు కాదు పెద్దవాడు అయిపోయాడు అని ఇంట్లో వాళ్లతో అనిపించుకోవాలి అని సూచించాడు.

Tags : Vijay Devarakonda, Shiva Koratala, betheREALMAN, Dulquer Salmaan, challenge


Next Story

Most Viewed