విజయవాడ చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

by  |
Vice President Venkaiah Naidu
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు గవర్నర్ బీబీ హరిచందన్, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డీజీపీ గౌతం సవాంగ్, కృష్ణా జిల్లా కలెక్టర్ నివాస్‌లు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దళాలతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి గౌరవ వందనం సమర్పించారు. విమానాశ్రయం నుంచి ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్‌కు వెంకయ్యనాయుడు బయలుదేరి వెళ్లారు.

సాయంత్రం 4 గంటలకు స్వర్ణభారత్ ట్రస్టులో జరిగే రైతు నేస్తం మాసపత్రిక వార్షికోత్సవంలో పాల్గొని రైతులకు పురస్కారాలను ఉపరాష్ట్రపతి అందజేయనున్నారు. అలాగే ఆదివారం విజయవాడలోని రామ్మోహన్‌ గ్రంథాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. సోమవారం చిన అవుటపల్లిలోని పిన్నమనేని ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ప్లాంటును ప్రారంభిస్తారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులతో భేటీ అవుతారు. మంగళవారం ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వెళ్తారని అక్కడ కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా కృష్ణా జిల్లాలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


Next Story

Most Viewed