పవన్ మూవీలో సెన్సేషనల్ డైరెక్టర్?

by  |
పవన్ మూవీలో సెన్సేషనల్ డైరెక్టర్?
X

దిశ, సినిమా: పవర్‌స్టార్​పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘వకీల్‌సాబ్’ షూటింగ్ కంప్లీట్ కాగానే ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. మరో వైపు క్రిష్ డైరెక్షన్‌లో పాన్ ఇండియా మూవీ ఓ షెడ్యూల్ పూర్తయింది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్‌ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. కాగా ఈ మూవీలో సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఓ కీ రోల్ ప్లే చేస్తున్నారని తెలుస్తోంది. ఈ వార్త ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

తెలుగులో పలువురు స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన డైరెక్టర్ వి.వి.వినాయక్.. మెగాస్టార్‌తో ‘ఠాగూర్, ఖైదీ నెంబర్ 150’ చిత్రాలు చేశారు. పవన్‌తోనూ ఓ సినిమా చేయాల్సి ఉన్నా, అది కార్యరూపం దాల్చలేదని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు వినాయక్. అయితే వినాయక్‌కు ఇప్పుడు డైరెక్టర్‌గా కాకపోయినా యాక్టర్‌గానైనా పవన్‌తో నటించే చాన్స్ వచ్చిందట. ఈ చిత్రంలో ఓ కీలక సన్నివేశంలో వినాయక్ కనిపించబోతున్నారని తెలుస్తుండగా.. ఇప్పటికే ఆ సీన్‌కు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని టాక్. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్‌లో ఇటీవలే జరిగిన షూటింగ్‌కు వినాయక్ హాజరయ్యారని సమాచారం. అయితే ఈ విషయమై వినాయక్ నుంచి గానీ, మూవీ యూనిట్ నుంచి గానీ అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. కాగా వినాయక్ గతంలో ‘ఠాగూర్’ ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాల్లో చిన్న పాత్రలో కనిపించారు.


Next Story

Most Viewed