వింత ఘటన : పిల్లికి బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్న యూఎస్ మహిళ

by  |
వింత ఘటన : పిల్లికి బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్న యూఎస్ మహిళ
X

దిశ, ఫీచర్స్ : యూఎస్ డెల్టా ఎయిర్ ఫ్లైట్‌ DL1360లో వింత ఘటన చోటుచేసుకుంది. అట్లాంటాకు వెళ్తున్న ఆ విమానంలో ఓ మహిళ పిల్లికి బ్రెస్ట్ ఫీడ్(తల్లిపాలు ఇవ్వడం) చేయడం ఇతర ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది. దీంతో ఆ క్యాట్‌ను క్యారియర్‌లో పెట్టాలని, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించరాదని విమాన సిబ్బంది ఆమెను రిక్వెస్ట్ చేశారు. కానీ సదరు మహిళ ససేమిరా అనడంతో పైలట్.. రెడ్‌కోట్ గ్రౌండ్ టీమ్‌కు షార్ట్ మెసేజ్ సెండ్ చేశాడు. ‘సీటు నంబరు 13Aలోని ప్రయాణికురాలు పిల్లికి పాలిస్తోంది. క్యాట్‌ను కారియర్‌లో పెట్టాలని ఫ్లైట్ అటెండెంట్ రిక్వెస్ట్ చేసినా పట్టించుకోవడం లేదు. మీరు మందలించండి’ అని కాక్‌పిట్ నుంచి గ్రౌండ్‌కు మెసేజ్ పంపించాడు.

ఎయిర్ క్రాఫ్ట్ అండ్ గ్రౌండ్ స్టేషన్స్‌కు మధ్య షార్ట్ మెసేజ్‌లు పంపించుకునేందుకు ‘ఎయిర్‌క్రాఫ్ట్ కమ్యూనికేషన్స్ అడ్రసింగ్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్(ACARS)’గా పిలువబడే డిజిటల్ డేటాలింక్ సిస్టమ్ ఉంటుంది. దీని ద్వారా పైలట్ మెసేజ్ పంపించగా.. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై స్పందిస్తున్న నెటిజన్లు ‘నాగరికత పరుగులు పెడుతోంది’ అంటూ సెటైర్ వేస్తున్నారు. ‘ఏంటీ విపత్తు.. ఎవరైనా మానవత్వాన్ని అన్‌ప్లగ్ చేసి, తిరిగి ప్లగ్ ఇన్ చేయడానికి ప్రయత్నించారా?’ అని కామెంట్ చేస్తున్నారు. ‘నేను ఇక ఈలోకానికి చెందాలని అనుకోవడం లేదు’ అని మరికొందరు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. కాగా సదరు మహిళపై యాక్షన్ తీసుకున్నారా? లేదా వార్నింగ్ ఇచ్చి వదిలేశారా? అనే వివరాలు ఇంకా బయటకు రాలేదు.


Next Story