అంచనాల్లేకుండా వచ్చి.. US ఓపెన్ టైటిల్ నెగ్గిన 18 ఏళ్ల ‘రడుక’..

257

దిశ, వెబ్‌డెస్క్ : క్రీడల పోటీల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ఒక్కోసారి గెలుస్తారు అనుకునేవారు ఓడిపోవచ్చు. ఓటమి అంచున ఉన్నవారు అనుకోకుండా గెలుపును సొంతం చేసుకోవచ్చు. తాజాగా జరిగిన యూఎస్ ఓపెన్ మహిళల టెన్నిస్ సింగిల్స్‌లో నిజంగానే అద్భుతం జరిగింది. ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో 150వ స్థానంలో కొనసాగుతున్న 18ఏళ్ల గ్రేట్ బ్రిటన్ ప్లేయర్ ‘ఎమ్మా రడుక’ ఏకంగా టైటిల్‌ను ఎగరేసుకుని పోయింది.

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో 18 ఏళ్ల ఎమ్మా రడుక కెనడాకు చెందిన 19 ఏళ్ల లేలా అన్నీ ఫెర్నాండెజ్‌ను ఓడించి తన కెరీర్‌లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. టెన్నిల్ విభాగంలో వరల్డ్ నెంబర్ 150వ స్థానంలో నిలిచిన ఈ ప్లేయర్ ఒక గంట 51 నిమిషాల్లో 6-4, 6-3 స్కోర్‌లైన్‌తో గ్రాండ్‌ స్లామ్ టైటిల్ ను కైవసం చేసుకుంది. కాగా, తొలిసారి గ్రాండ్ స్లామ్ క్వాలిఫైయర్ మ్యాచ్‌కు ఎంపికైన రడుక ఏకంగా టైటిల్‌ను సాధించడం పట్ల బ్రిటన్ టెన్నిస్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..