- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ భూవ్యవహారంతో నాకు సంబంధంలేదు :ఉప్పల్ ఎమ్మెల్యే
<p>దిశ, కాప్రా : కాప్రా మండల రెవెన్యూ పరిధిలో గల పలు సర్వే నంబర్లలోని భూమి కబ్జాకు తనకేలాంటి సంబంధం లేదని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తెలిపారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడాతూ… ప్రభుత్వ భూమిని కొందరు స్థానికులు కబ్జా చేస్తున్నారని గ్రహించిన ఉప్పల్ రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లి ఆపే క్రమంలో అధికారిపై దాడికి పాల్పడ్డారు. ఆ ఎమ్మార్వో నాకు సమాచారం తెలపడంతో నేను ఇక్కడి డీసీపీ […]</p>

దిశ, కాప్రా : కాప్రా మండల రెవెన్యూ పరిధిలో గల పలు సర్వే నంబర్లలోని భూమి కబ్జాకు తనకేలాంటి సంబంధం లేదని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తెలిపారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడాతూ… ప్రభుత్వ భూమిని కొందరు స్థానికులు కబ్జా చేస్తున్నారని గ్రహించిన ఉప్పల్ రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లి ఆపే క్రమంలో అధికారిపై దాడికి పాల్పడ్డారు. ఆ ఎమ్మార్వో నాకు సమాచారం తెలపడంతో నేను ఇక్కడి డీసీపీ తో మాట్లాడి జరిగిన సంఘటనను వివరించి, అధికారికి రక్షణ కల్పించాలి అని కోరడం జరిగిందన్నారు. ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుంటే రక్షించే క్రమంలో ఇలాంటి ఆరోపణలు చేయడం చాలా బాధాకరమని, నాకు ఆ ల్యాండ్ కు ఎలాంటి సంబంధం లేదని, కనీసం నేను ఆ భూమిని చూడలేదన్నారు.
ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా దాన్ని రక్షించాల్సిన బాధ్యత ఒక ప్రజా ప్రతినిధిగా నాపై ఉందన్నారు. 2011 లో అది గవర్నమెంట్ ల్యాండ్ అని అధికారులు ధృవీకరించారు. ఒక ఉద్యమకారునిగా ఒక మంచి పరిపాలన చేస్తుంటే కొందరు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తనపై కోర్టులో ఆరోపణలు చేసింది ఎవరో కూడా తెలియదన్నారు. విచారణ జరుగక మందే భూకబ్జా అంటూ ఆరోపణలు చేస్తున్నారని, నియోజకవర్గ అభివృద్ధి చూసి ఓర్వలేకే తనపై తప్పుడు అరోపణలు చేస్తున్నారని వారిపై పరువు నష్టం వేస్తానన్నారు.






