ఇతిహాసాల వైపు ‘ఇండియన్ సినిమా’

by  |
ఇతిహాసాల వైపు ‘ఇండియన్ సినిమా’
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ సినిమా మళ్లీ పురాణాల వైపు మళ్లింది. రామాయణ, మహాభారత ఇతిహాసాలను మరోసారి వెండితెరపై ఆవిష్కరించబోతుంది. నిజానికి ముందు జనరేషన్లకు నానమ్మలు, తాతయ్యలు పురాణ కథలను చెప్పేవారు. కానీ ప్రస్తుత జనరేషన్‌‌కు అలాంటి అవకాశం లేదు. అందుకే ఫిల్మ్ మేకర్స్ ఆ బాధ్యత తీసుకుని కథలు చెప్పేందుకు రెడీ అవుతున్నారు. ప్రాచీన సంపదను బిగ్ స్క్రీన్‌పైకి బిగ్గెస్ట్ లెవల్‌లో తీసుకురాబోతున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌గా తెరకెక్కుతున్న సినిమాలు అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటాయి కాబట్టి.. మేకర్స్ కూడా ఎక్కడా రాజీ పడకుండా సినిమాలను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. భారీ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ విజువల్స్‌తో ఆనాటి కథలను నేటి తరానికి సరికొత్తగా అందించబోతున్నారు. అవేంటో చూద్దాం..

బ్రహ్మాస్త్ర

హిందూ మైథాలజీ ఆధారంగా తెరకెక్కుతున్న బాలీవుడ్ ఫాంటసీ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో మూడు భాగాలుగా వస్తున్న సినిమా మొదటి భాగంలో బ్రహ్మాస్త్రం అనే పౌరాణిక ఆయుధం ప్రాముఖ్యతను గురించి వివరించబోతున్నారు. మహాభారత యుద్ధంలో కీలకపాత్ర పోషించిన బ్రహ్మాస్త్రం చుట్టూ అల్లుకున్న కథలో అమితాబ్ బచ్చన్, ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్, నాగార్జున, మౌనీ రాయ్ ప్రధానపాత్రల్లో కనిపించబోతున్నారు.

ఆదిపురుష్

పాన్ ఇండియా హీరో ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్న సినిమా ‘ఆదిపురుష్’. రామాయణ ఇతిహాసాన్ని కమర్షియల్ హంగులతో బిగ్ స్క్రీన్‌పై ప్రజెంట్ చేయబోతుండగా.. ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. 2021 జనవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న సినిమాలో సీతమ్మగా కృతి సనన్ నటిస్తుండగా.. 2022 ఆగష్టు 11న సినిమా రిలీజ్ కానుంది.

రామ్ సేతు

బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ హీరోగా వస్తున్న చిత్రం ‘రామ్ సేతు’. రామ్ సేతు పురాణ సంపదా? కాదా? అని తెలుసుకునేందుకు ఓ వ్యక్తి సాగించే ప్రయత్నమే రామ్ సేతు కథ. కాగా ఈ సినిమా ద్వారా రామాయణం గొప్పతనాన్ని మరోసారి ప్రపంచానికి వివరించబోతున్నారు డైరెక్టర్ అభిషేక్ శర్మ. రామ జన్మస్థలం అయోధ్యలో సినిమా మేజర్ పోర్షన్ షూటింగ్ కంప్లీట్ కానుండగా.. 2021 మిడిల్‌లో షూటింగ్ ప్రారంభించి 2022 దీపావళికి సినిమా రిలీజ్ చేయనున్నారు. కాగా అరుణ్ భాటియా, విక్రమ్ మల్హోత్రా సినిమాను నిర్మిస్తున్నారు.

ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ

విక్కీ కౌశల్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న చిత్రం ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’. ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సూపర్ హీరో ఫిల్మ్ మూడు భాగాలుగా తెరకెక్కనుండగా.. మహాభారతంలోని అశ్వత్థామ క్యారెక్టర్ బేస్ చేసుకుని ఉండబోతుంది. ఫస్ట్ టైమ్ విక్కీ మైథలాజికల్ క్యారెక్టర్ ప్లే చేస్తుండగా.. ఇందుకోసం హార్స్ రైడింగ్, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు. కురుక్షేత్రంలో కౌరవుల తరపున పోరాడే అశ్వత్థాముడు.. గురువు ద్రోణాచార్యుడి కుమారుడు కాగా.. ఆయన బలం, బలహీనతల గురించి తెలుపుతూ సూపర్ హీరోగా చూపించబోతున్నారు.

మహాభారత్

మధు మంతెన నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ‘మహాభారత్’ సినిమాలో దీపికా పదుకొనే నటించబోతున్నారు. ద్రౌపది పాయింట్ ఆఫ్ వ్యూలో తెరకెక్కుతున్న సినిమాలో దీపిక ద్రౌపది రోల్ ప్లే చేస్తుండగా.. ఈ మైథలాజికల్ సినిమా ఫ్రెష్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతుంది. ఈ పాత్ర చేసేందుకు గౌరవంగా, థ్రిల్‌గా ఫీల్ అవుతున్నట్లు తెలిపిన దీపిక.. ఒక కొత్త దృక్పథంలో మహాభారతాన్ని తెరపై చూపించబోతుండటం ఆసక్తికరంగా ఉందని తెలిపింది. కాగా దీపిక కూడా ఈ సినిమాకు మరో నిర్మాత కావడం విశేషం.

Next Story

Most Viewed