వాహనదారులకు బిగ్ రిలీఫ్‌ను ఇస్తున్న ఆ ప్రభుత్వం.. వారెవ్వా సూపర్ ఐడియా అంటున్న నెటిజన్లు

by Disha Web Desk 1 |
వాహనదారులకు బిగ్ రిలీఫ్‌ను ఇస్తున్న ఆ ప్రభుత్వం.. వారెవ్వా సూపర్ ఐడియా అంటున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా మాడు పగిలేంతలా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో జనం ఇంట్లో ఉన్నప్పటికీ ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఇక రాత్రి వేళల్లో పరిస్థితి చెప్పనక్కర్లేదు. సగటు మనిషి రోజుకు ఎంత పరిణామంలో తాగు‌నీరు తీసుకుంటున్నారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇక వృద్ధులు, చిన్నారులు ఎండ తాకిడికి కుదేలైపోతున్నారు. మరోవైపు రోజు కూలీలు, రైతులు దేశంలో ఎక్కడో ఓ చోట వడదెబ్బతో ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అదేవిధంగా పగటి పూట బైక్‌లపై ఆఫీసులకు వెళ్లే వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వారు వెళ్లే దారిలో సిగ్నల్ పడొద్దు దేవుడా.. అని ప్రార్థిస్తూ, కిందామీద పడుతూ ఎలాగోలా ఆఫీసులకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే పాండిచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచనకు తెరలేపింది. నగరాల్లోని పలు సిగ్నళ్ల వద్ద గ్రీన్ మ్యాట్‌లను ఏర్పాటు చేసింది. దీంతో సిగ్నల్ పడినప్పుడు ఎండ అనేది వాహనదారులపై పడకుండా ఆ గ్రీన్ మ్యాట్ రక్షణగా ఉంటుంది. దీంతో వాహనదారులు సిగ్నళ్ల వద్ద కాసేపు రిలాక్స్ అవుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్విట్టర్‌లో షేర్ చేయగా.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed