- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Union budget: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ ఈసీకి భారీగా నిధులు
కేంద్ర ఎన్నికల కమిషన్ నిధులు భారీగా పెరగడం రాజకీయంగా ఆసక్తినిరేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర బడ్జెట్‍లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు (Election Commission of India) భారీగా నిధులు కేటాయించడం ఆసక్తిగా మారిది. ఇవాళ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో (Union Budget 2026) ఈసీకి నిధులు 25.33 శాతం పెరిగాయి. గతేడాది బడ్జెట్ లో రూ. 304.98 కోట్లు ఉండగా ఈసారి రూ. 382.22 కోట్లకు పెరిగింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి పోల్ ప్యానెల్ కు కేటాయించిన మొత్తం నిధులలో ఎన్నికల సంబంధిత ఖర్చుల కోసం రూ. 367.69 కోట్లుకేటాయించగా మిగిలిన మొత్తం పరిపాలన, కార్యకలాపాల ఖర్చుల కోసం వినియోగించనున్నారు. కాగా ఈ ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళతో పాటు పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. 2027లో ఉత్తర ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీకి నిధులను కేంద్రం పెంచడం ఆసక్తిగా మారింది. కాగా అధికార బీజేపీ, ఈసీ కుమ్మక్కు అయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో ఎన్నికల కమిషన్ కు బడ్జెట్ లో నిధులు పెంచడంపై ప్రతిపక్షాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి మరి.






