రోడ్డు ప్రమాదం.. కేంద్రమంత్రి భార్య మృతి

37

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉత్తరకన్నడ జిల్లా అంకోలా సమీపంలో కారు బోల్తా పడి కేంద్రమంత్రి శ్రీపాద నాయక్‌ సతీమణి విజయ మృతి చెందారు. ఈ ప్రమాదంలో కేంద్రమంత్రి శ్రీపాద నాయక్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎల్లాపూర్ నుంచి గోకర్ణ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీపాద నాయక్.. రక్షణశాఖ, ఆయుష్ శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.