త్వరలోనే దుబ్బాక తరహాలోనే గుణపాఠం !

by  |
త్వరలోనే దుబ్బాక తరహాలోనే గుణపాఠం !
X

దిశ, తెలంగాణ బ్యూరో: మునుపెన్నడూ లేని విధంగా అధికార దుర్వినియోగం, అరాచకం, అక్రమ అరెస్టులు దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంత దారుణ పరిస్థితులు గత ఎన్నికల్లో ఎప్పుడూ చూడలేదని మంగళవారం హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. దుబ్బాక ఎన్నికల్లో అధికారులు పక్షపాతిగా వ్యవహరించారని, బీజేపీ నాయకులపై, కార్యకర్తలపై దౌర్జన్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తంచేశారు. టీఆర్ఎస్ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉంటుందని వారు భావిస్తున్నారన్నారు. పాలకులు, అధికారుల తీరును ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే దుబ్బాక తరహాలోనే గుణపాఠం తప్పదని ఆయన చెప్పారు. బీజేపీ నాయకులపై, అభ్యర్థి రఘునందన్‌రావు ఇంటిపై, వారి బంధువులపై , హైదరాబాద్‌లో కూడా సోదాలంటూ ఇబ్బందులకు గురిచేశారన్నారు.

బీహార్‌లో శాంతి యుతంగా…
బీహార్‌లో ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగాయని, అక్కడ కూడా ప్రజలు బీజేపీ కూటమి ఎన్‌డీఏ‌కే పట్టం కట్టారని పేర్కొన్నారు. బీజేపీ శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలను కోరుకుంటుందని, దాదాపు మినీ సంగ్రామంగా జరిగిన బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా ఉప ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నరేంద్ర మోడీ పరిపాలనా, నితీష్ కుమార్‌ల తీరుతో విజయాలు చేకూరాయని పేర్కొన్నారు.

Next Story

Most Viewed