- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గండిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని గండిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సీబీఐటీ కాలేజీ రోడ్డులో కరెంట్ పోల్‌ను కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగినట్టు సమాచారం. ఏపీ09 సీజే 2095 స్విఫ్ట్ డిజైర్ కారు విద్యుత్ పోల్‌ను అతివేగంగా వచ్చి ఢీకొట్టగా.. ఆ సమయంలో ఎయిర్ బ్యాగ్స్ తెరచుకున్నాయి. అయినా, కూడా ప్రాణనష్టం సంభవించింది. అంతేకాకుండా, కారులో వెడ్డింగ్ కార్డులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని గండిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సీబీఐటీ కాలేజీ రోడ్డులో కరెంట్ పోల్‌ను కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగినట్టు సమాచారం. ఏపీ09 సీజే 2095 స్విఫ్ట్ డిజైర్ కారు విద్యుత్ పోల్‌ను అతివేగంగా వచ్చి ఢీకొట్టగా.. ఆ సమయంలో ఎయిర్ బ్యాగ్స్ తెరచుకున్నాయి. అయినా, కూడా ప్రాణనష్టం సంభవించింది. అంతేకాకుండా, కారులో వెడ్డింగ్ కార్డులు లభ్యమైనట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Next Story






