- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయనగరం జిల్లాలో విషాదం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, విశాఖపట్నం: చెరువులో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయిన సంఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. భోగాపురం మండలం పోలిపల్లిలో బుధవారం దుర్గారావు అనే వ్యక్తి చెరువు ఊబిలో కూరుకుపోతుండగా పక్కనే ఉన్న పైడయ్య గమనించి సాయం చేసేందుకు యత్నించాడు. ఇదేక్రమంలో కాలు జారి పైడయ్య కూడా ఊబిలో పడిపోవడంతో ఇద్దరూ మృతిచెందారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి […]</p>

X
దిశ, విశాఖపట్నం: చెరువులో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయిన సంఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. భోగాపురం మండలం పోలిపల్లిలో బుధవారం దుర్గారావు అనే వ్యక్తి చెరువు ఊబిలో కూరుకుపోతుండగా పక్కనే ఉన్న పైడయ్య గమనించి సాయం చేసేందుకు యత్నించాడు. ఇదేక్రమంలో కాలు జారి పైడయ్య కూడా ఊబిలో పడిపోవడంతో ఇద్దరూ మృతిచెందారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Next Story






