మేడారంలో మరో ఇద్దరి మృతి

by  |
మేడారంలో మరో ఇద్దరి మృతి
X

తెలంగాణ కుంభమేళా మేడారం జాతరలో అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి. గురువారం ఇద్దరు భక్తులు గుండెపోటుతో మృతిచెందారు. దీంతో జాతరకు వచ్చి ప్రాణాలు విడిచిన వారి సంఖ్య ఐదుకు చేరింది. జంపన్నవాగులో మునకలు వేస్తుండగా నర్సయ్య(65)కు ఛాతిలో నొప్పి వచ్చింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలుపగా, వారు దవాఖానకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. వరంగల్ జిల్లా శివనగర్‌కు చెందిన గుండె వేణు(30) అనే యువకుడు కూడా జంపన్నవాగు సమీపంలో గుండెపోటుతో మృతిచెందారు.

Next Story