- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా వల్లే ఇండియా ఓడింది: అంపైర్ బక్నర్
<p>దిశ, స్పోర్ట్స్: అంపైర్ స్టీవ్ బక్నర్ అంటే క్రికెట్ ప్రేమికులకు సుపరిచితమైన పేరు. అత్యంత సౌమ్యుడు. అనుభవజ్ఞుడు. అలాంటి స్టీవ్ బక్నర్‌కు జీవితంలో మరిచిపోలేని మ్యాచ్ 2008లో ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచే. సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన మ్యాచ్‌గా నిలిచిపోయింది. రసవత్తరంగా జరిగిన ఈ మ్యాచ్‌లో అంపైర్ల తప్పుడు నిర్ణయాలు, మంకీగేట్ వివాదాలతో చరిత్రపుటలకు ఎక్కింది. కాగా, ఈ మ్యాచ్ జరిగిన 12 ఏళ్ల తర్వాత […]</p>

దిశ, స్పోర్ట్స్: అంపైర్ స్టీవ్ బక్నర్ అంటే క్రికెట్ ప్రేమికులకు సుపరిచితమైన పేరు. అత్యంత సౌమ్యుడు. అనుభవజ్ఞుడు. అలాంటి స్టీవ్ బక్నర్‌కు జీవితంలో మరిచిపోలేని మ్యాచ్ 2008లో ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచే. సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన మ్యాచ్‌గా నిలిచిపోయింది. రసవత్తరంగా జరిగిన ఈ మ్యాచ్‌లో అంపైర్ల తప్పుడు నిర్ణయాలు, మంకీగేట్ వివాదాలతో చరిత్రపుటలకు ఎక్కింది. కాగా, ఈ మ్యాచ్ జరిగిన 12 ఏళ్ల తర్వాత ఆ రోజు అంపైరింగ్ చేసిన బక్నర్ స్పందించారు. మిడ్‌డే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘2008లో జరిగిన సిడ్నీటెస్ట్‌లో నేను రెండు తప్పిదాలు చేశాను. మొదటిది భారత్ పటిష్టంగా ఉన్న స్థితిలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ సెంచరీ చేసేలా చేశాను. రెండోది టెస్ట్ చివరి రోజు చేశాను. ఇది భారత ఓటమికి కారణమైంది. ఇలా ఐదు రోజుల్లో రెండు తప్పిదాలు చేసిన తొలి అంపైర్ నేనేనా? అని ఇప్పటికి నన్ను వెంటాడుతుంది’ అని తెలిపాడు. 135 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఆసీస్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత సైమండ్స్ 30 పరుగుల వద్ద ఔటైనా బక్నర్ అవుటివ్వలేదు. ఆ తర్వాత సైమండ్స్ 160 పరుగులు చేశాడు. ఇదే మ్యాచ్‌లో ద్రవిడ్ ఔట్ కాకున్నా బక్నర్ ఔటిచ్చాడు. ఈ రెండు నిర్ణయాలు భారత ఓటమికి కారణమయ్యాయి.






