- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రక్తమోడిన బౌరంపేట రహదారి.. చెల్లాచెదురుగా మృతదేహాలు
<p>దిశ, కుత్బుల్లాపూర్: మద్యం మత్తులో వేగంగా వెళ్లి ఆగి ఉన్న లారీని కారుతో ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చరణ్, సంజు, గణేష్, అశోక్ లు నిజాంపేటలో ఉంటున్నారు. నలుగురు ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. అయితే వీరు శనివారం సాయంత్రం పార్టీ చేసుకునేందుకని ఇంటి నుండి బయలుదేరారు. […]</p>

దిశ, కుత్బుల్లాపూర్: మద్యం మత్తులో వేగంగా వెళ్లి ఆగి ఉన్న లారీని కారుతో ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చరణ్, సంజు, గణేష్, అశోక్ లు నిజాంపేటలో ఉంటున్నారు. నలుగురు ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. అయితే వీరు శనివారం సాయంత్రం పార్టీ చేసుకునేందుకని ఇంటి నుండి బయలుదేరారు. గండిమైసమ్మలో పార్టీ చేసుకొని ఆదివారం ఉదయం సుమారు 3 గంటల ప్రాంతంలో కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. బౌరంపేట కొకకోలా కంపెనీ వద్దకు రాగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వీరి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చరణ్, సంజు, గణేష్ లు అక్కడికక్కడే మృతి చెందారు. అశోక్ కు తీవ్ర గాయాలు కావడంతో సురారంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.






