- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన లారీ.. ఇద్దరు మృతి
<p>దిశ, మానకొండూరు : కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంకరపట్నం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఓ లారీ.. ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 10 మంది గాయపడ్డారు. వివరాల ప్రకారం.. ఏపీ నుంచి మహారాష్ట్రకు కట్టెల లోడుతో వెళ్తున్న లారీ.. హమాలి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 21 మంది ఉన్నట్టు సమాచారం. అయితే వీరంతా కేశవపట్నం శివారులోని పరమేశ్వర […]</p>

దిశ, మానకొండూరు : కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంకరపట్నం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఓ లారీ.. ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 10 మంది గాయపడ్డారు. వివరాల ప్రకారం.. ఏపీ నుంచి మహారాష్ట్రకు కట్టెల లోడుతో వెళ్తున్న లారీ.. హమాలి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది.ఈ ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 21 మంది ఉన్నట్టు సమాచారం. అయితే వీరంతా కేశవపట్నం శివారులోని పరమేశ్వర మోడ్రన్ రైస్ మిల్లులో పనికి వెళ్లి వస్తున్నారు. ప్రమాద ఘటనపై సమచారం అందుకున్న కేశవపట్నం ఎస్ఐ తోట తిరుపతి సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకొని, పోలీసు వాహనంలో, ప్రైవేటు వాహనాల్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో ఇద్దరు కూలీలు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతులను మనోజ్(45), మిట్టు(16)గా పోలీసులు గుర్తించారు.






