కరోనా వైరస్: అమిత్ షా మోడల్? కేజ్రీవాల్ మోడల్

by  |
కరోనా వైరస్: అమిత్ షా మోడల్? కేజ్రీవాల్ మోడల్
X

న్యూఢిల్లీ: కరోనా కట్టడి వ్యూహాలపై ఢిల్లీలో గందరగోళం నెలకొంది. ఒకటేమో కేంద్రహోం మంత్రి అమిత్ షా ఆదేశించిన వ్యూహాం. మరొకటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన విధానం. ఈ రెండు మాడల్‌లలో ఏది సరైందో, ఏ విధానంలో ప్రజలు సమస్యలను ఎదుర్కోరో దాన్నే అమలు చేస్తామని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ‘ఢిల్లీలో కరోనా కట్టడికి ఇప్పుడా రెండు మాడల్స్ ఉన్నాయి. కరోనా పాజిటివ్ తేలిన పేషెంట్‌లందరూ క్వారంటైన్ సెంటర్‌కు తప్పక వెళ్లాలనే అమిత్ షా మాడల్. మరొకటి, కరోనా పేషెంట్‌ ఇల్లును ఒక బృందం చేరి వైరస్ తీవ్రతను పరీక్షించాలనే కేజ్రీవాల్ మాడల్. ఢిల్లీలో ప్రతి కరోనా పేషెంట్‌ క్వారంటైన్ సెంటర్ వెళ్లాలని ఆదేశించరాదు. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కేంద్ర మంత్రికి ఓ లేఖ రాశాను’ అని వివరించారు.

Next Story

Most Viewed