ఎంసెట్ ఫలితాలు విడుదల….

255

దిశ,వెబ్ డెస్క్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం విడుదల చేశారు. తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్)‌లో 75.29 శాతం మంది అర్హత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,19,183 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కాగా వీరిలో 89,734 మంది అర్హత సాధించారు. ఫలితాలను అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ eamcet.tsche.ac.in లో చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.

కాగా అక్టోబర్ 9 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు. అక్టోబర్9 నుంచి 12 వరకు ఆన్ లైన్ స్లాట్ల నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపిన సంగతి తెలిసిందే.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..