ప్రభుత్వాలు ఊడిగం చేస్తున్నాయి : చాడ

53

           కార్పొరేట్ శక్తలకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఊడిగం చేస్తున్నాయని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మట్లాడుతూ… ప్రభుత్వ సంస్థలను అమ్మడమంటే.. దేశాన్ని అమ్మేయడమే అన్నారు. ప్రధాని మోడీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకూ ఎన్ని ఉద్యోగాలు కల్పించారో కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..