బంగ్లాదేశ్ చొరబాటుదారులను సెటిల్ చేసేందుకు టీఎంసీ ప్రయత్నిస్తుంది: మోడీ

by Disha Web Desk 17 |
బంగ్లాదేశ్ చొరబాటుదారులను సెటిల్ చేసేందుకు టీఎంసీ ప్రయత్నిస్తుంది: మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా రెండో దశ ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రధాని మోడీ తన ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా ఉత్తర్‌లో జరిగిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన టీఎంసీ ప్రభుత్వం, కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులను బెంగాల్‌లో సెటిల్ చేసేందుకు టీఎంసీ కృషి చేస్తుంది. టీఎంసీ చేసిన ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం వలన రాష్ట్రంలో 26,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయని మోడీ అన్నారు.

బెంగాల్ యువకుల భవిష్యత్తుతో ఆ పార్టీ ఆడుకుంది. టీఎంసీ పాలనలో వేల కోట్ల స్కామ్‌లు జరిగాయి. రాష్ట్ర ప్రజలు దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ ''కట్-అండ్-కమీషన్" సంస్కృతి కారణంగా యువత నష్టపోయారని మోడీ టీఎంసీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రజల ఆస్తులను లాక్కోవాలని కోరుకుంటోంది. దీనికి వ్యతిరేకంగా టీఎంసీ ఒక్క మాట కూడా అనడం లేదు. ఈ రెండు పార్టీల మధ్య బుజ్జగింపుల పోటీ ఉంది. టీఎంసీ పాలనలో ఒక్కటి మాత్రమే సాగింది, అది వేల కోట్ల కుంభకోణాలు మాత్రమేనని మమత ప్రభుత్వంపై ప్రధాని మోడీ మండిపడ్డారు.

బంగ్లాదేశ్ చొరబాటుదారులకు రాష్ట్రంలో భూములను ఇవ్వడానికి ప్రభుత్వం పనిచేస్తుందని మోడీ అన్నారు. ఒకప్పుడు బెంగాల్ భారతదేశ అభివృద్ధికి చోదకశక్తిగా ఉండేది, అయితే టీఎంసీ ఈ రాష్ట్రం గొప్పతనాన్ని, గౌరవాన్ని దెబ్బతీసి, అభివృద్ధిని ఆపేసింది. ప్రభుత్వం చేసిన స్కామ్ కారణంగా కలకత్తా హైకోర్టు 26 వేల మంది ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేసింది. కాషాయ పార్టీ, టీఎంసీలాగా కాకుండా యువ సాధికారతకు కట్టుబడి ఉందని మోడీ అన్నారు.



Next Story

Most Viewed