కేసీఆర్ ఏమైన.. భూతవైద్యుడా : భట్టి

by Shyam |   (  Updated:2020-03-14 07:47:21  IST  )

<p>దిశ, న్యూస్ బ్యూరో : కేసీఆర్ కరోనా వ్యాధి గురించి భూత వైద్యుడిలా మాట్లాడుతున్నడని సీఎల్పీనేత భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్‌ను చూసి కరోనా గజగజ వణకదని, సీఎంను చూసి కరోనా వణికితే కరోనా వ్యాపించిన దేశాలన్ని ఆయన్ను వైరస్ వ్యాపించిన దేశాలన్నీ తిప్పాలని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. శనివారం అసెంబ్లీ సమావేశంలో కరోనాపై చర్చించిన సందర్భరంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాధి నివారణపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే ప్రజలు ఇబ్బందు ఎదుర్కొంటరన్నారు. ముఖ్యమంత్రి [&hellip;]</p>

కేసీఆర్ ఏమైన.. భూతవైద్యుడా : భట్టి
X

దిశ, న్యూస్ బ్యూరో : కేసీఆర్ కరోనా వ్యాధి గురించి భూత వైద్యుడిలా మాట్లాడుతున్నడని సీఎల్పీనేత భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్‌ను చూసి కరోనా గజగజ వణకదని, సీఎంను చూసి కరోనా వణికితే కరోనా వ్యాపించిన దేశాలన్ని ఆయన్ను వైరస్ వ్యాపించిన దేశాలన్నీ తిప్పాలని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. శనివారం అసెంబ్లీ సమావేశంలో కరోనాపై చర్చించిన సందర్భరంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాధి నివారణపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే ప్రజలు ఇబ్బందు ఎదుర్కొంటరన్నారు. ముఖ్యమంత్రి కరోనా వ్యాధిపై ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు. కరోనాకు పారాసిటమాల్‌ ట్యాబ్‌లెట్ వేసుకుంటే సరిపోతుందని కేసీఆర్‌ అన్నారంటూ భట్టి ఎద్దేవా చేశారు. అంతేకాక 27డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే కరోనా దరి చేరదని, అంత ఎండలో ఆ వైరస్ చనిపోతుందని సీఎం అసెంబ్లీలోనే చెప్పారని గుర్తు చేశారు. అలాంటప్పుడు కర్ణాటక వాసి హుస్సేన్ సిద్ధిఖీ హైదరాబాద్‌లో అన్ని ఆస్పత్రుల్లో చికిత్స పొందిన తర్వాత కూడా ఎలా చనిపోయాడని ప్రశ్నించారు.

Tags : TS CLP leader batti vikramarka, cm kcr, carona virus, assembli

Next Story