బ్రేకప్ బాటలో మరో బాలీవుడ్ జంట.. 

854

దిశ, సినిమా: ప్రస్తుతం ప్రేమ పెళ్లిల్లకు సంబంధించిన వార్తలే బాలీవుడ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవలే లవ్ బర్డ్స్ రాజ్ కుమార్ రావ్, పత్ర లేఖ మ్యారేజ్ చేసుకోగా.. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ కూడా డిసెంబర్ 9న ఒక్కటి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో అర్జున్ కపూర్, మలైకా అరోరా సైతం 2022 లో పెళ్లి చేసుకుంటారని అందరూ భావించారు. కానీ అభిమానుల అంచనాలను తలకిందులు చేస్తూ ఈ జంట విడిపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇద్దరి మధ్య సంబంధాలు సరిగ్గా లేవని, డేటింగ్‌కు ముగింపు పలికి ఎవరి దారి వారు చూసుకోబోతున్నట్లుగా ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది.

అంతేకాదు రాబోయే ‘క్రిస్‌మస్, న్యూ ఇయర్’ వేడుకలను కలిసి జరుపుకునేందుకు వీరిద్దరూ ఆసక్తిగా లేరని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. కానీ ఈ హాట్ కపుల్ సన్నిహితులు మాత్రం అదంతా ఫేక్ న్యూస్‌ అని కొట్టిపారేస్తున్నారు. సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్లే అర్జున్ ఈసారి మలైకాతో సెలబ్రేట్ చేసుకోలేపోతున్నాడని, ఎవరికి నచ్చినట్టు వాళ్లు ఊహించుకుని మాట్లాడటం మానేస్తే అందరికీ ఆరోగ్యకరమని సూచిస్తున్నారు. 

విడాకుల తర్వాత సమంత ఎందుకు మరీ అలా చేస్తుంది..?