రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్టు వేయడం వెనుక రహస్యమిదే.. KTR ఆసక్తికర వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్టు వేయడం వెనుక రహస్యమిదే.. KTR ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేసిన రోడ్డు షోలో ఆయన గురువారం మాట్లాడారు. రేవంత్ రెడ్డి రోజుకొక దేవుడి మీద ఒట్టు వేస్తున్నారని.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగానే హమీలు నెరవేరుస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రోజుకో దేవుడిపై ఒట్టు వేస్తున్నాడని మండిపడ్డారు. ఎందుకు దేవుళ్ల మీదనే ఒట్టు వేస్తున్నాడు? ఎందుకు తన భార్య, పిల్లల మీద ఒట్టు వేయడం లేదని ఫైర్ అయ్యారు. ఎందుకంటే దేవుళ్లు అడగరని కాబట్టి దేవుళ్ల మీద ఒట్టు వేస్తున్నాడన్నారు. ఎన్నికల తర్వాత ప్రజలను మళ్లీ రేవంత్ రెడ్డి మోసం చేస్తాడన్నారు.



Next Story

Most Viewed