Ap Elections: ఎన్నికల సంఘం సీరియస్.. ఇద్దరికీ స్ట్రాంగ్ వార్నింగ్

by Disha Web Desk 16 |
Ap Elections: ఎన్నికల సంఘం సీరియస్..  ఇద్దరికీ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజకీయాల్లో ఈసీ నిర్ణయాలు సంచలనంగా మారాయి. మే 13న ఎన్నికలు జరగనుండటంతో ఓటింగ్ ప్రక్రియ నిర్వహణను ముమ్మరం చేసింది. అటు ఎన్నికల కోడ్‌ను పటిష్టంగా అమలు చేస్తోంది. ప్రధానంగా నేతల ప్రవర్తనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కోడ్ ఉల్లంఘిస్తూ ఎవరూ ప్రవర్తిస్తున్నా వెంటనే చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే చాలా మంది అధికారులపై చర్యలు తీసుకుంది. చంద్రబాబు, జగన్ లాంటి నాయకులకు కూడా నోటీసులు జారీ చేసింది. చర్యలు ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో నేతలు అనుసరిస్తున్న తీరు, చోటు చేసుకుంటున్న ఘటనలు, నేతల ప్రసంగాలపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తోంది.

తాజాగా సీఎం జగన్‌కు ఎన్నికల సంఘం తీవ్ర హెచ్చరిక చేసింది. మేమంతా సిద్ధం సభల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై వైఎస్ జగన్ అనుచితంగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. అయితే జగన్ వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తున్నారు. దీంతో జగన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వివరాలు ఇవ్వాలని 2 రోజులు సమయం ఇచ్చింది. అయినా సరే సీఎం జగన్ మోహన్ రెడ్డి అదే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఎన్నికల సంఘం మళ్లీ సీరియస్ అయింది. జగన్‌కు గతంలో ఇచ్చిన నోటీసుపై సరైన వివరణ రాకపోవడంతో ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఎం హోదాలో ఉన్న జగన్ బాధ్యతారహితంగా మాట్లాడటం తప్పని ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సభల్లో, రోడ్ షోల్లో ప్రతిపక్ష నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. అటు చంద్రబాబుకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ సభల్లో జగన్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని, జాగ్రత్తగా వ్యవహరించాలని ఈసీ సూచించింది.

Read More..

AP Politics: దగ్గుపాటి ప్రసాద్ ను గెలిపించండి.. మందకృష్ణ మాదిగ పిలుపు

Next Story

Most Viewed