ఈటల రాజేందర్ గెలుపును కాంక్షిస్తూ శ్రీశైలం వరకు పాదయాత్ర

by Mahesh |
ఈటల రాజేందర్ గెలుపును కాంక్షిస్తూ శ్రీశైలం వరకు పాదయాత్ర
X

దిశ, మేడ్చల్ టౌన్: పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని కోరుతూ.. బీజేపీ యువ నాయకుడు నాలబాపని సౌమిత్ రెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అత్వెల్లి శివాలయం నుండి శ్రీశైలం వరకు పాదయాత్రగా బయలుదేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఈటల రాజేందర్ కోడలు క్షమిత, బీజేపీ నాయకులు నా రెడ్డి నందారెడ్డిలు హాజరై పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర చేస్తున్న వారిలో వై నరేందర్ రెడ్డి, ఎన్ అరవింద్ రెడ్డి, ఎన్ నిఖిల్ రెడ్డి, వర్గంటి నితిన్, సాయిరాం, సాయి కుమార్, బన్నీ, రవి తేజ, ప్రవీణ్, సంపత్, సతీష్‌లు ఉన్నారు.

Next Story