చైనా నుంచి పరిహారం రాబట్టేందుకు సిద్ధమైన అమెరికా

by  |
చైనా నుంచి పరిహారం రాబట్టేందుకు సిద్ధమైన అమెరికా
X

వాషింగ్టన్ : చైనా నిర్లక్ష్యపు ధోరణి వల్లే అమెరికా కరోనా వైరస్ కారణంగా భారీ ప్రాణ, ఆర్థిక నష్టాన్ని చవిచూసిందని ఆరోపిస్తూ భారీ పరిహారాన్ని కోరడానికి అమెరికా సిద్దపడుతోంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ సోమవారం మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే జర్మనీ ప్రభుత్వం చైనా నుంచి 165 బిలియన్ డాలర్ల పరిహారాన్ని కోరేందుకు సిద్ధమైంది. కాగా, జర్మనీ కంటే మరింత భారీ మొత్తాన్ని కోరేందుకు అమెరికా సంసిద్ధమవుతోంది. కరోనా వైరస్ విషయంలో చైనా పారదర్శకంగా వ్యవహరించలేదని ట్రంప్ బాహాటంగానే ఆరోపిస్తున్నారు. డ్రాగన్ కంట్రీ కరోనా వైరస్ సంబంధిత సమాచారాన్ని ఎందుకు దాచిపెడుతోందో అర్థం కావడం లేదని.. త్వరలోనే తప్పకుండా అమెరికా స్వతంత్ర దర్వాప్తు చేయిస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. కరోనా విషయంలో చైనా నేతలనే బాధ్యులుగా చేయడానికి మా దగ్గర చాలా మార్గాలు ఉన్నాయి. కానీ, అంతర్జాతీయ దర్యాప్తుకే మేం మొగ్గు చూపుతున్నామని ట్రంప్ స్పష్టం చేశారు. కోవిడ్ – 19 కారణంగా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనమయ్యాయి. అమెరికా కూడా భారీగా నష్టపోయింది. దానికి మరిన్ని రెట్ల పరిహారాన్ని చైనా నుంచి రాబడతాం. కాని ఇప్పుడే ఎంత మొత్తమో చెప్పలేమని ట్రంప్ అన్నారు.

Tags : Donald Trump, China, Damage Charges, Coronavirus, WHO, Covid-19


Next Story

Most Viewed