హరీష్ రావు సవాల్‌ను స్వీకరిస్తున్నా.. CM రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

by Disha Web Desk 2 |
హరీష్ రావు సవాల్‌ను స్వీకరిస్తున్నా.. CM రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్‌తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరీష్ రావు సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. పంద్రాగస్టు లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని అన్నారు. హరీష్ రావు తన రాజీనామా లేఖ సిద్ధంగా ఉంచుకోవాలని రివర్స్ ఛాలెంజ్ చేశారు. రైతుల సమస్యలు తీర్చేందుకు తాము ఉన్నామని.. తీర్చలేని పరిస్థితిలో అధికారం ఎందుకు అని అన్నారు. తప్పకుండా రుణమాఫీ చేస్తామన్నారు. ఎన్నికల వేళ బీఆర్ఎస్, బీజేపీలు చేసే ఇటువంటి కుట్రలను కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ తిప్పికొట్టాలని సూచించారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర జరుగుతోందని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ అంటే.. భారతీయ బ్రిటీష్ విధానం అని అభివర్ణించారు. మోడీ, అమిత్ షా బ్రిటీష్ విధానంతో ముందుకు వెళ్తున్నారని అన్నారు. దేశంలో రిజర్వేషన్లు లేకుండా చేయాలనేదే వారి విధానమని తెలిపారు. బీజేపీకి ఈ భావజాలం ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిందని తెలిపారు. రాజకీయ స్వార్థం కోసమే బీజేపీ ఇదంతా చేస్తోందని మండిపడ్డారు. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెళ్లో ఉండాలి.. అంతేగాని రోజూ రోడ్డుమీద దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగటం వారికే చెల్లుతుందని విమర్శించారు. పండుగలు వస్తే చాలు బీజేపీ సమస్యలు సృష్టించడానికి రెడీగా ఉంటుందని అన్నారు. టెస్టులు, వన్డే మ్యాచ్‌లు ఆడే రోజులు ఇవి కాదని.. ఇప్పుడంతా టీ20 ట్రెండ్ నడుస్తోందని అన్నారు. సెమీ ఫైనల్‌లో కేసీఆర్‌ను ఓడించాం.. ఇక ఫైనల్లో మోడీని ఓడించబోతున్నట్లు ప్రకటించారు.



Next Story