పెళ్లి కొడుకు చేసిన పనికి మండపంలో ఎమోషనల్ అయిన బుల్లితెర నటి ఆర్తి సింగ్.. వీడియో వైరల్

by Dishafeatures1 |
పెళ్లి కొడుకు చేసిన పనికి మండపంలో ఎమోషనల్ అయిన బుల్లితెర నటి ఆర్తి సింగ్.. వీడియో వైరల్
X

దిశ,సినిమా: బుల్లితెర నటి ఆర్తి ‘మాయ్క’ అనే సీరియల్‌తో 2007లో ఎంట్రీ ఇచ్చింది. తోడ హై బాస్‌ తోడే కీ జరూరత్‌ హై, పరిచయ్‌, వారీస్‌ అనే షోలతో పాపులారిటీ తెచ్చుకుంది. హిందీ బిగ్‌బాస్‌ 13వ సీజన్‌లో పాల్గొని నాలుగో రన్నరప్‌గా నిలిచింది. కాగా ఈ వారం ప్రారంభంలోనే ఆర్తి ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. హల్దీ, మెహందీ, సంగీత్‌ ఫంక్షన్స్‌ సైతం గ్రాండ్ గా జరిగాయి.

Read More..

అల్లు అర్జున్ తన భార్యను ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా..?


తాజాగా ఆర్తి సింగ్‌ 39 ఏళ్ల వయసులో బిజినెస్‌మెన్‌ దీపక్‌ చౌహాన్‌ ను ముంబై జుహులోని ఇస్కాన్‌ ఆలయప్రాంగణంలో బుధవారం మనువాడింది. అయితే పెళ్లికొడుకు దీపక్‌ గుర్రపు స్వారీ చేసుకుంటూ కల్యాణ మండపానికి వచ్చాడు. తెల్లని షేర్వాణీ ధరించిన అతడు తలపై పింక్‌ టర్బన్‌ పెట్టుకున్నాడు. ఆర్తి రెడ్‌ కలర్‌ లెహంగాలో మెరిసిపోయింది. పెళ్లి కొడుకు ఆమె దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో కొంత సంతోషం, కొంత సిగ్గుతో ముడుచుకుపోయింది. ఈ ఎమోషనల్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


కాగా వీరి పెళ్లికి విక్కీ జైన్‌- అంకిత లోఖండే, దేవలీనా భట్టాచార్జి, రష్మీ దేశాయ్‌, యువిక చౌదరి, కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌-బిపాషా బసు.. తదితర సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.





Next Story