పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీల నిరసన

82
దిశ, తెలంగాణ బ్యూరో: ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న నిరసన కొనసాగుతోంది. ఐదో రోజు శుక్రవారం ప్లకార్డులతో  టీఆర్ఎస్ ఎంపీలు నిరసన చేపట్టారు. పార్లమెంట్ ఎదుట ఎంపీలు కేశవరావు, సంతోష్ కుమార్, సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, మాలోత్ కవితలు ధాన్యం కొనుగోలు చేసేంత వరకు విశ్రమించబోమని స్పష్టం చేశారు. రైతుల సమస్యలను కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేస్తారో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంభించడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఒక మాట, తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు మరో మాట మాట్లాడుతుండటంతో   రైతుల్లో అయోమయం నెలకొందన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.