రాష్ట్రానికి నిజమైన కరోనా కాంగ్రెస్: జీవన్ రెడ్డి

by Shyam |

<p>దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వ్యాధి నివారణకు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు హర్షిస్తే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. వారు రాష్ట్రానికి నిజమైన కరోనా అని ఆయన అభివర్ణించారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కరోనా వ్యాధిపై ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టామన్నారు. ప్రపంచం మొత్తం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిందని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్, మంత్రి [&hellip;]</p>

రాష్ట్రానికి నిజమైన కరోనా కాంగ్రెస్: జీవన్ రెడ్డి
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వ్యాధి నివారణకు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు హర్షిస్తే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. వారు రాష్ట్రానికి నిజమైన కరోనా అని ఆయన అభివర్ణించారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కరోనా వ్యాధిపై ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టామన్నారు. ప్రపంచం మొత్తం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిందని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారని చెప్పారు. కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని రూ.500 కోట్లు విడుదల చేశమని.. అవసరమైతే మరో రూ.5000 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

Tags: jeevan reddy, trs, mla, comments, corona

Next Story