- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆక్రమణకు అండగా టీఆర్ఎస్ కౌన్సిలర్’
<p>దిశ, మేడ్చల్ టౌన్ : మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో రాఘవేంద్ర కాలనీలో రోడ్డు ఆక్రమణకు గురవుతున్నదని మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డికి బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో గల రాఘవేంద్ర నగర్ కాలనీ రోడ్డు ఆక్రమణకు స్థానిక టీఆర్ఎస్ కౌన్సిలర్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రోడ్లపై అక్రమ కట్టడం తొలగించాలని అధికారులకు, స్థానిక టీఆర్ఎస్ కౌన్సిలర్‌కు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన […]</p>

దిశ, మేడ్చల్ టౌన్ : మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో రాఘవేంద్ర కాలనీలో రోడ్డు ఆక్రమణకు గురవుతున్నదని మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డికి బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో గల రాఘవేంద్ర నగర్ కాలనీ రోడ్డు ఆక్రమణకు స్థానిక టీఆర్ఎస్ కౌన్సిలర్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రోడ్లపై అక్రమ కట్టడం తొలగించాలని అధికారులకు, స్థానిక టీఆర్ఎస్ కౌన్సిలర్‌కు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ కట్టడాలను తొలగించి కాలనీవాసులు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ బీజేపీ ఉపాధ్యక్షులు చెరువు కొమ్ము శ్రీనివాస గౌడ్, బీజేపీ నాయకులు పెంజర్ల మల్లేష్ యాదవ్, కాలనీ వాసులు అసోసియేషన్ సభ్యులు జ్ఞానదేవ్ గుప్త, సంతోష్, నవీన్, గణేశ్, ధర్మదేవ్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.






