- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా క్రికెటర్ ఆత్మహత్య
by Shyam |
<p>దిశ, స్పోర్ట్స్: త్రిపుర రాష్ట్ర అండర్ 19 మహిళా జట్టు సభ్యురాలు అయంతి రీయాంగ్ మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. 16 ఏండ్ల అయంతి అగర్తలలోని తన ఇంటిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయిందని, అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని స్థానిక దినపత్రిక ‘సియాండన్’ తెలిపింది. అగర్తల నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉదయ్‌పూర్ డివిజన్ తెనానీ ఆమె స్వగ్రామం. కుటుంబంలోని నలుగురు సంతానంలో అయంతి చివరి అమ్మాయి. చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న […]</p>

X
దిశ, స్పోర్ట్స్: త్రిపుర రాష్ట్ర అండర్ 19 మహిళా జట్టు సభ్యురాలు అయంతి రీయాంగ్ మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. 16 ఏండ్ల అయంతి అగర్తలలోని తన ఇంటిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయిందని, అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని స్థానిక దినపత్రిక ‘సియాండన్’ తెలిపింది. అగర్తల నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉదయ్‌పూర్ డివిజన్ తెనానీ ఆమె స్వగ్రామం. కుటుంబంలోని నలుగురు సంతానంలో అయంతి చివరి అమ్మాయి. చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న ఆమె అంచెలంచెలుగా ఎదిగి, ప్రస్తుతం త్రిపుర అండర్ 19, అండర్ 23 జట్లకు ఆమె ప్రాతినిథ్యం వహిస్తోంది. ‘రాష్ట్రం ఒక ప్రతిభావంతురాలైన క్రీడాకారిణిని కోల్పోయింది. ఆమె మరణవార్త మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది’ అని త్రిపుర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి తిముర చందా అన్నారు.
Next Story






