పురిటి నొప్పులొస్తే డోలిలే దిక్కు

by  |
పురిటి నొప్పులొస్తే డోలిలే దిక్కు
X

దిశ, వెబ్ డెస్క్ : అడవినే ప్రపంచంగా భావించి జీవించే వారు అడవి బిడ్డలు. అలాంటి అడవిబిడ్డలకు కనీసం రోడ్లు, వైద్య సదుపాయం లేకపోడం దురదృష్టకరం. రాళ్లు, ముళ్లు ఉన్న డొంకదారులతో అడవి బిడ్డలు అవస్థలు పడుతున్నారు. పురిటి నొప్పులు వచ్చినా.. విషపురుగులు కాటేసినా, జ్వరం వచ్చినా , నొప్పి వచ్చినా రాళ్లురప్పలు ఉన్న కాలిబాటలే దిక్కు. కొండలు, అడవుల నుంచి డోలి కట్టి మోసుకెళ్లడమే తప్ప మరోదారి లేదు వారికి.

ఆదివాసీల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. కనీసం గూడెలకు అంబులెన్స్ లు కూడా వెళ్లలేని దుస్థితి. పురిటి నొప్పులతో తల్లడిల్లుతున్న మహిళను ఏ అధికారి, నాయకుడు ఆదుకోకపోయిన మానవత్వం ఉన్న ఓ ఎన్జీవో అక్కున చేర్చుకుని సేవలందించింది.

మానవత్వం ఎక్కడో ఓ చోట ఉంటది అంటారుగా.. అందుకేనేమో పురిటి నొప్పులతో బాధ పడుతున్న గర్భిణీ సమస్యపై తవ్వరగా స్పందించిన స్వచ్చంధ సంస్థ అధికారి దేవుడే పంపిన అన్నలా ఆ మహిళకి చేయుతనందించాడు. ఏన్కూర్ మండలం కొత్త మేడేపల్లికి చెందిన హేమ్లా నిర్మలాకుమారి నిండు గర్భిణీ. ఆమెకు మంగళవారం ఉదయం 5 గంటల నుంచి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. కొత్త మేడేపల్లి అడవీలో ఉండడంతో రోడ్డు సౌకర్యం లేదు.

దీంతో ఆమె భర్త భీమారావుతోపాటు కుటుంబ సభ్యులు డోలి కట్టుకుని కాలిబాటలో ఏన్కూర్ కు పయనమయ్యారు. మార్గమధ్యలో ఎన్జీవో శ్రీనివాస్ కు భీమారావు సమాచారం అందించారు. ఆయన వెంటనే స్పందించి 108 కి సమాచారం అందించాడు. దీంతో హుటాహుటిన హేమ్లాని ఏన్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి వైద్యసిబ్బంది గర్భిణీని పరీక్షించి మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ప్రధాన ఆసుపత్రికి తరలించారు.


Next Story