ఎక్సైజ్ అధికారులపై గిరిజనుల దాడి

44

దిశ, వెబ్‌డెస్క్: నాగర్ కర్నూలు జిల్లాలో ఎక్సైజ్ అధికారులపై గిరిజనులు దాడి చేశారు. మంగళవారం కోడేరు మండలం నార్యానాయక్ తండాలో సోదాలు నిర్వహించేందుకు వెళ్లిన ఎక్సైజ్ అధికారులకు, గిరిజనులకు మధ్య వివాదం తలెత్తడంతో ఘర్షణకు దారి తీసింది. దీంతో ఎక్కువ సంఖ్యలో వచ్చిన గిరిజనులు అధికారులను కొట్టారు. ఈ క్రమంలోనే హెడ్ కానిస్టేబుల్ శంకర్‌ నాయక్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. ఎక్సైజ్ అధికారులు వెంటనే శంకర్‌నాయక్‌ను ఆస్పత్రికి తరలించారు. తండాలో భారీగా పోలీసులు మోహరించారు.