కారు అపరిశుభ్రంగా ఉందని ఫిర్యాదు!.. 1 లక్ష పరిహారం అందుకున్న కస్టమర్

by Disha Web Desk 5 |
కారు అపరిశుభ్రంగా ఉందని ఫిర్యాదు!.. 1 లక్ష పరిహారం అందుకున్న కస్టమర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తాను బుక్ చేసుకున్న ఓలా క్యాబ్ అపరిశుభ్రంగా ఉందని ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తి ఓలా సంస్థ నుంచి లక్ష పరిహారాన్ని అందుకున్నాడు. అక్టోబర్ 19, 2021న హైదరాబాద్ కు చెందిన జబేజ్ శామ్యూల్ అనే వ్యక్తి తన భార్యతో కలసి 4 గంటల ట్రిప్ వెళ్లడానికి ఓలాకు చెందిన క్యాబ్ బుక్ చేసుకున్నాడు. కారు అపరిశుభ్రంగా ఉందని, దుర్వాసన వస్తొందని, ఏసీ ఆన్ చేయమని అడిగినా.. డ్రైవర్ నిరాకరించాడని ఫిర్యాదు చేశాడు. అంతేగాక నాలుగైదు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత కారు డ్రైవర్ దుష్ప్రవర్తనతో తమను దింపేశాడని, దీని కోసం ఫుల్ చార్జీ రూ.861 వసూలు చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై హైదరాబాద్ ఓలా మేనేజర్ స్పందిస్తూ.. ఫిర్యాదుదారు ఆరోపణలను ఖండించాడు.

ఓలా కేవలం కస్టమర్ కు, స్వతంత్ర క్యాబ్ డ్రైవర్ కు మధ్య ఆన్‌లైన్ మధ్యవర్తి మాత్రమేనని, ఓలా కంపెనీ ఆన్‌లైన్ అప్లికేషన్స్‌లో వేల సంఖ్యలో స్వతంత్ర క్యాబ్ డ్రైవర్లు రిజిస్టర్ చేసుకుంటారని, ప్లాట్‌ఫారమ్ లో నమోదైన ప్రతి డ్రైవర్ ను తనిఖీ చేస్తారని ఆశించలేమని తెలిపాడు. ఫిర్యాదు చేసిన వ్యక్తి బుక్ చేసుకున్న ప్యాకేజీకి సంబందించిన అన్ని షరతులను ఇష్టపూర్వకంగా అంగీకరించినట్లు తెలిపారు. దీంతో హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కస్టమర్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కస్టమర్ చెల్లించిన రూ.861 లకు 12 శాతం వడ్డీతో చెల్లించాలని ఓలాను ఆదేశించింది. అంతేగాక తాను అనుభవించిన మానసిక వేదనకు పరిహరంగా రూ.1 లక్ష తోపాటు పిర్యాదు ఖర్చు నిమిత్తం మరో రూ.5000 అదనంగా చెల్లించాలని ఆదేశాలిచ్చింది.



Next Story

Most Viewed