ఈనెల 25న యుగాంతం.. యువ సన్యాసి వ్యాఖ్యలు వైరల్

by Muthe.Rajitha |

యుగాంతం.. ఈమాట అనేకసార్లు ప్రపంచాన్ని వణికించింది.

ఈనెల 25న యుగాంతం.. యువ సన్యాసి వ్యాఖ్యలు వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : యుగాంతం.. ఈమాట అనేకసార్లు ప్రపంచాన్ని వణికించింది. ముఖ్యంగా 2012 డిసెంబర్ 12న యుగాంతం వస్తుందనే పుకారును ప్రపంచంలోని అనేకమంది నమ్మారు కూడా. ఇక యుగాంతంపై వచ్చిన ఆర్టికల్స్, సినిమాలకు లెక్కేలేదు. అవన్నీ చూస్తే.. నిజమేనేమో అని భయపడ్డవారూ ఉన్నారు. అయితే ఇటీవల మరో యుగాంతం పుకారు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆఫ్రికా ఖండంలోని ఘనాకు చెందిన నోవా.. "ఈనెల 25న యుగాంతం రాబోతోందని దేవుడు నా కలలోకి వచ్చి చెప్పాడు.

బతకాలి అనుకునేవాళ్లు నా నౌకల్లోకి వచ్చి తలదాచుకోండి." అంటూ చెప్పిన జోస్యం మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. అనేకమంది నోవా మాటలు విని, ముల్లె మూట సర్దుకొని నౌకల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే చాలామంది 'ఇలాంటి యుగాంతలు చాలా చూశామని..' నోవా జోస్యాన్ని కొట్టి పడేస్తున్నారు. ఏదేమైనా ఈ యువకుడు చెప్పిన యుగాంతం కథనం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Next Story