- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీడు నా తమ్ముడు, చంపకండి.. చిరుతకు రాఖీ కట్టి ప్రాణాలు కాపాడిన మహిళ
రాఖీ పండగ వచ్చిందంటే అన్నాతమ్ముళ్లకు అక్కా చెల్లెల్లు రాఖీలు కడుతుంటారు. సోదరుడికి సోదరి రక్ష, సోదరికి సోదరుడు రక్ష అని చెప్పుకునేందుకు ప్రతీకగా ఈ పండగను

దిశ, వెబ్ డెస్క్: రాఖీ పండగ వచ్చిందంటే అన్నాతమ్ముళ్లకు అక్కా చెల్లెల్లు రాఖీలు కడుతుంటారు. సోదరుడికి సోదరి రక్ష, సోదరికి సోదరుడు రక్ష అని చెప్పుకునేందుకు ప్రతీకగా ఈ పండగను జరుపుకుంటారు. అంటే భవిష్యత్ లో వారికి ఎలాంటి అపాయం వచ్చినా అండగా ఉంటామని చెప్పకనే చెప్పినట్టు. అయితే అలాంటి రాఖీ పండగను ఓ మహిళ చిరుత పులితో జరుపుకుంది. అంతే కాకుండా రాఖీ కట్టి ఆ చిరుతపులి ప్రాణాలనే రక్షించింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
రాఖీ కట్టిన సమయంలో ఆ చిరుతపులి గాయపడి ఉండటంతో భయపడకుండా కట్టేసింది. ఓ గ్రామంలోకి చిరుతపులి రావడంతో గ్రామస్తులు అంతా దానివెంటపడి కొట్టారు. ఈ క్రమంలో అది గాయపడింది. వాళ్లు దాన్ని చంపేస్తారేమో అనే భయంతో అక్కడే ఉన్న మహిళ చిరుత చేతికి రాఖీ కట్టింది. ఇది నా తమ్ముడు..ఇప్పుడు దీన్ని ఎవరూ చంపకూడదు అని చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఇండియా బిగినర్స్ కోసం కాదు ట్రోల్ చేస్తున్నారు.






