- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రీల్స్ పిచ్చి.. పసిబిడ్డను తలపై పెట్టుకుని తల్లి డ్యాన్సులు.. షాకింగ్ వీడియో వైరల్
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి కొంతమంది వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. కొందరు తమ ప్రాణాలను లైకులు, షేర్ల కోసం రిస్క్ లో పెడుతుంటే మరికొందరు తమ పక్కన ఉన్నవారి ప్రాణాలను సైతం రిస్క్ లో పెడుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి కొంతమంది వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. కొందరు తమ ప్రాణాలను లైకులు, షేర్ల కోసం రిస్క్ లో పెడుతుంటే మరికొందరు తమ పక్కన ఉన్నవారి ప్రాణాలను సైతం రిస్క్ లో పెడుతున్నారు. తాజాగా ఓ తల్లి చేసిన పని సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. లైకులు, షేర్ల కోసం ఆ తల్లి చిన్నారి ప్రాణాలనే ఏకంగా రిస్క్ లో పెట్టేసింది.
తాను బాహుబలి సినిమాలో శివగామి అనుకుందో ఏమోగానీ తన బిడ్డను తలపై పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఆ రీల్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీడియోలో తల్లి తన చిన్నారి బిడ్డను తలపై పెట్టుకుని డ్యాన్స్ చేస్తుండగా బిడ్డ నడుం వంగిపోయినట్టు కనిపిస్తుంది. కానీ కనీసం చేతులతో బిడ్డను పట్టుకోకుండా ఆ తల్లి వీడియో స్టెప్పులు వేస్తూ కనిపించింది. ఇక వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
నీ సోషల్ మీడియా పిచ్చితో బిడ్డను చంపేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ బిడ్డ కింత పడితే ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో జనాలను ఆకట్టుకునేందుకు పిల్లలను సైతం రిస్క్ లో పెడుతున్నారని.. ఇలాంటి తల్లులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇటీవల ఓ తల్లి సోషల్ మీడియాలో రీల్ చేయనని చెప్పినందుకు పిల్లడిని చావబాది మరీ వీడియో తీసింది. ఇలాంటి వరుస ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకరంగా మారింది. VIDEO






