కోటిన్నరకు భర్తను అమ్మేసిన భార్య

by Sujitha Rachapalli |

మధ్యప్రదేశ్‌లో వింత కేసు వెలుగులోకి వచ్చింది. భర్తను ప్రియురాలికి కోటిన్నరు అమ్మేసింది భార్య. భోపాల్‌కు చెందిన రాజేష్ కుమార్(40)కు భార్య రజిని,

కోటిన్నరకు భర్తను అమ్మేసిన భార్య
X

దిశ, వెబ్ డెస్క్: శుభలగ్నం సినిమా గుర్తుందా? జగపతి బాబు, ఆమని, రోజా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమాలో డబ్బుపై వ్యామోహంతో భర్తను ప్రియురాలికి అమ్మేస్తుంది భార్య. ఆ తర్వాత ఒంటరితనంతో బాధపడుతుంది. డబ్బు కన్నా బంధాలే గొప్పవని చెప్పడం ఈ సినిమా ఉద్దేశం. కాగా సారాంశం ఇది కాకపోవచ్చు ఆల్మోస్ట్ ఇలాంటి ఘటనే మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోనూ జరిగింది. భర్తను ప్రియురాలికి కోటిన్నరు అమ్మేసింది భార్య.

భోపాల్‌కు చెందిన రాజేష్ కుమార్(40)కు భార్య రజిని, కూతురు ఉన్నారు. అయితే అతను ఆఫీసులో తనకంటే కొంచెం ఎక్కువ వయసున్న మహిళతో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్నాడు. ఓ రోజు ఇంట్లో ఈ విషయం తెలిసి గొడవల జరిగాయి. ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. దీంతో విసుగుచెందిన కూతురు తండ్రి ఎఫైర్ వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని కోర్టుకు ఎక్కింది. కూతురు మానసిక పరిస్థితిని గుర్తించిన తల్లి.. భర్త ప్రియురాలితో ఓ డీల్ కుదుర్చుకుంది. తన భర్తను వదిలేయాలంటే.. కోటిన్నర ఇవ్వాలని డీల్ కుదుర్చుకుంది. వెంటనే ఆస్తులు ట్రాన్స్‌ఫర్ చేయాలని షరతు పెట్టింది. ఇందుకు అంగీకరించిన ప్రియురాలు.. ఆస్తులను రజినీ పేరు మీద రాసేసింది. ఫ్యామిలీ కోర్టు ఇందుకు సమ్మతించడంతో రజినీ విడాకులు తీసుకుంది. ఆర్థిక భద్రత రావడంతో తాను, తన కూతురు ఈ వివాదాలకు దూరంగా ప్రశాంతంగా ఉంటామని తెలిపింది. 2021లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం రాజేష్ తన గర్ల్ ఫ్రెండ్‌తో ఉంటున్నాడు.

Next Story