- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పరాయి మహిళా ఫొటోకు లైక్ కొట్టిన భర్త.. భరణం ఇప్పించాలని కోర్టుకెక్కిన భార్య!
స్మార్ట్ ఫోన్లు వచ్చాక ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ఓ ప్రపంచంలా మారిపోయింది. నిమిషం కూడా మొబైల్స్‌ను వదిలి ఉండలేని పరిస్థితి నెలకొంది.

దిశ, వెబ్‌డెస్క్ : స్మార్ట్ ఫోన్లు వచ్చాక ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ఓ ప్రపంచంలా మారిపోయింది. నిమిషం కూడా మొబైల్స్‌ను వదిలి ఉండలేని పరిస్థితి నెలకొంది. నచ్చిన ప్లాట్‌ఫాం ఓపెన్ చేసి గంటల తరబడి రీల్స్, వీడియోస్ స్క్రోల్ చేస్తుంటారు. నచ్చిన ఫొటోలకు, రీల్స్‌కు లైక్స్ చేయడంతోపాటు కామెంట్స్ పెడుతుంటారు. ఇదంతా ఎలా ఉన్నా.. మహిళా ఫొటోను లైక్ చేసినందుకు ఓ భర్త.. భార్యకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇంతకు ఏం జరిగిందో చూద్దాం.
టర్కీకి చెందిన ఓ యువజంట ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. తన భర్త నిత్యం సోషల్ మీడియాను చూస్తూ మహిళల ఫొటోలకు లైక్‌లు కొడుతున్నాడని, వాటిని చూస్తూ ఆనందిస్తున్నాడని టర్కీ సివిల్ కోర్టులో భార్య కేసు వేసింది. కేసు విచారణ చేపట్టిన టర్కీ సివిల్ కోర్టు అప్పీలేట్ డివిజన్ బెంచ్.. భర్త సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించింది. భార్య చేస్తున్న ఆరోపణలు నిజమని తేలడంతో భర్తదే తప్పు అని నిర్ధారించింది. అతడికి శిక్షగా రూ.85 వేలు భౌతిక పరిహారం, మరో రూ.85 వేలు నైతిక పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా భార్యకు నెలవారీ జీవనోపాధి చెల్లించాలని ఆదేశించింది.
ఈ సందర్భంగా న్యాయమూర్తులు సీరియస్‌గా స్పందించారు. భర్త చేసిన పనిని తీవ్రమైన నేరంగా అభిప్రాయపడ్డారు. భార్య పక్కన ఉండగానే మరో మహిళ ఫొటోను లైక్ చేయడం అంటే నేరుగా వివాహేతర సంబంధం పెట్టుకోకపోయినా అది భార్యకు మానసికంగా వేధించడమేని, వివాహ బంధంలోని నమ్మకాన్ని దెబ్బతీస్తుందని స్పష్టం చేశారు. భార్యను పట్టించుకోకుండా సోషల్ మీడియాలో ఆనందం వెతుక్కునే భర్తలకు ఈ తీర్పు ఒక ఉదాహారణగా నిలుస్తుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
కోర్టు తీర్పు అనంతరం స్పందించిన భార్య.. భర్త ప్రవర్తనపై విసిగిపోయే కోర్టును ఆశ్రయించినట్టు తెలిపింది. తనను అవమానించేలా నా ఎదుటే నిరంతరం మహిళల ఫొటోలను చూస్తూ, వాటిని లైక్ చేస్తున్నాడని వాపోయింది. భర్త ప్రవర్తన తనను తీవ్రంగా అవమానించడమే కాకుండా, తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేసింది. అతడి ప్రవర్తనతో మా మధ్య నమ్మకం సన్నగిల్లిందని, ఇది మా దాంపత్య జీవితానికి ముప్పుగా మారిందని కన్నీరు పెట్టుకుంది.






