- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చనిపోయిన తరువాత ఏం జరుగుతుంది? అమెరికన్ మహిళ చెప్పిన భయానక రహస్యాలు!
'జాతస్య హి ధ్రువో మృత్యు:' అనే భగవత్గీత శ్లోకం మనందరికి తెలిసే ఉంటుంది.

దిశ, వెబ్ డెస్క్: 'జాతస్య హి ధ్రువో మృత్యు:' అనే భగవత్గీత (Bhagavad Gita) శ్లోకం మనందరికి తెలిసే ఉంటుంది. అంటే.. భూమిపై ప్రతి ప్రాణికి జనన మరణాలనేవి సహజమైనవని అర్థం. అయితే, మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందనేది ఎవరికి తెలియదు. ఈ ప్రశ్నకు సమాధానం శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కకుండా మిగిలిపోయింది. అయితే, ఈ ప్రశ్నకు అమెరికాలోని (America) కొలరాడోకు చెందిన 33ఏళ్ల బ్రయానా లాఫర్జీ (Briana Lafarge) అనే మహిళ ప్రత్యక్ష అనుభవంతో చనిపోయిన తరువాత ఏం జరుగుతుందో సమాధానం చెప్పి ఆశ్చర్యానికి గురిచేసింది.
బ్రయానా లాఫర్టీ కొన్ని రోజులుగా డైస్టోనియా అనే ప్రాణాంతకమైన న్యూరలాజికల్ వ్యాధితో (Neurological disease) బాధపడుతుంది. ఈ క్రమంలో ఎనిమిది నిమిషాల పాటు క్లినికల్ డెత్ అనుభవించింది. అంటే.. డాక్టర్లు ఆమె మరణించిందని ప్రకటించారు. కానీ, అదే సమయంలో ఆమెకు చోటు చేసుకున్న అనుభవం గురించి వివరించింది. 'నాకు చావు అనిపించలేదు.. కానీ నా ఆత్మ నా శరీరాన్ని వదిలేసి ఎగిరిపోయింది' అంటూ ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. 'మొదట నా చుట్టూ గాఢమైన చీకటి. ఆ తర్వాత ఒక్కసారిగా నా దేహం నుంచి నేను విడిపోతున్న భావన. చనిపోయేటప్పుడు నాకు ఎలాంటి నొప్పి, బాధ కలగలేదు. బదులుగా ఎంతో మన:శాంతి కలిగింది' అంటూ బ్రయానా లాఫర్టీ తెలిపింది.
ఆ అనుభవం తర్వాత బ్రయానా జీవితం పూర్తిగా మారిపోయింది. తిరిగి నడవాలంటే, మాట్లాడాలంటే ఆమె చాలా కష్టపడాల్సి వచ్చింది. పిట్యూటరీ గ్రంథిలో సమస్య కారణంగా మెదడులో శస్త్రచికిత్స జరిగింది. కానీ ఆమె చెప్పిన మాటలు మనిషి జీవితానికి కొత్త అర్థాన్ని సూచిస్తున్నాయి. చివరగా ఏది జరిగినా ఏదో ఒక ప్రయోజనం కోసం జరుగుతుందని ఆమె చెప్పింది.






