Video Viral:తన పిల్లతో కలిసి రోడ్డు దాటుతున్న ఎలుగుబంటి.. ఒక్కసారిగా ఎదురైనా చిరుత.. చివరికి ఏమైందంటే!?

by Jakkula.Mamatha |

ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జంతువులకు సంబంధించిన వీడియోలు నిత్యం దర్శనమిస్తునే ఉన్నాయి.

Video Viral:తన పిల్లతో కలిసి రోడ్డు దాటుతున్న ఎలుగుబంటి.. ఒక్కసారిగా ఎదురైనా చిరుత.. చివరికి ఏమైందంటే!?
X

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జంతువులకు సంబంధించిన వీడియోలు నిత్యం దర్శనమిస్తునే ఉన్నాయి. జంతువులు, పక్షులు చేసే వింత చేష్టలను కొందరు నెటిజన్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఎలుగుబంటి, చిరుత పులి మధ్య గొడవకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఛత్తీస్​గఢ్​ నారాయణపుర్​ జిల్లాలోని అబుజ్మద్ ప్రాంతంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అబుజ్మద్ ప్రాంతంలోని పుగుఢ్ గ్రామంలో ఇటీవల రోడ్డు నిర్మాణ పనులు పూరైనట్లు సమాచారం. అయితే కొత్తగా నిర్మించిన రోడ్డుపై ఒక ఎలుగుబంటి తన పిల్లతో రోడ్డు దాటుతుంది.

ఈక్రమంలో అక్కడికి సడన్‌గా ఒక చిరుత పులి వచ్చింది. ఇక ఆ చిరుత ఎలుగుబంటిని చూసి దానిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అది గమనించిన ఎలుగుబంటి తన పిల్లకు ఏమైనా అపాయం కలుగుతుందో అని భావించి.. ఆవేశానికి గురై పులిపై దాడికి దిగింది. కొంచెం కూడా భయం లేకుండా ఎలుగుబంటి తన పిల్లను వెనుక పెట్టుకొని మరీ చిరుత పై పోరాడింది. దీంతో చిరుత అడవిలోకి పారిపోయింది. అయితే.. ఆడ ఎలుగుబంటి తన పిల్లను కాపాడుకోవడానికి క్రూరమైన చిరుతపులితో పోరాడిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం గ్రామానికి సమీప ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ విజువల్స్​పై అటవీ శాఖ(Forest Department) దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

https://www.dailymotion.com/video/x9jpp2o

Next Story