- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral News:పాముకు గుణపాఠం నేర్పిన పక్షి.. ఏం చేసిందో చూడండి!(వీడియో)
పిల్లలపై తల్లి చూపించే ప్రేమ వర్ణానాతీతం.

దిశ,వెబ్‌డెస్క్: పిల్లలపై తల్లి చూపించే ప్రేమ వర్ణానాతీతం. తను పస్తులు ఉంటూ తన బిడ్డల కడుపు నింపుతుంది. అమ్మ స్వార్ధం లేని ప్రేమను పంచుతుంది. తన పిల్లలకు కష్టం వస్తే అల్లాడిపోతోంది. ఇక, కడుపున పుట్టిన బిడ్డలకు ప్రమాదం ఎదురు కాబోతుందని తెలిస్తే మాతృమూర్తిలో మహా శక్తి మేల్కొంటుంది. ప్రాణాలకు తెగించి మరీ బిడ్డల ప్రాణాలు కాపాడుకుంటుంది. అందుకోసం ఎంతటి సాహసం చేయడానికి అయినా వెనుకాడదు. మనుషులకైనా.. జంతువులకైన తల్లి ప్రేమ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తాజాగా ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. తన బిడ్డలను కాపాడటం కోసం ఓ తల్లి పక్షి చేసిన సాహసం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
వైరల్ వీడియో ప్రకారం.. ఒక పక్షి చెట్టు పై గూడు కట్టుకుని అందులో తన పిల్లలతో హ్యాపీగా ఉంటుంది. ఈ క్రమంలో ఓ పాము ఆ పక్షి పిల్లలను తినడానికి గూడులోకి వెళ్తుంది. ఆ పాము అటు ఇటు చూసి వెంటనే పిల్ల పక్షులపై దాడి చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇది గమనించిన ఆ పక్షి ఒక్కసారిగా పాము ముందుకు వచ్చి నిలబడుతుంది. పాము పిల్లలను తినడానికి ముందుకు కదిలిన వెంటనే.. పక్షి తన ముక్కుతో పాము నోటిని నొక్కుతుంది. పాము పక్షి పట్టు నుంచి తనను తాను విడిపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
కానీ పక్షి నుంచి ఆ పాము తప్పించుకోలేక పోయింది. గూడులో కూర్చున్న రెండు పిల్ల పక్షులు నోరు తెరిచి ఇద్దరి మధ్య జరిగే పోరాటాన్ని ఆసక్తిగా చూస్తున్నాయి. అయితే ఆ పామును చూసిన పక్షి భయపడకుండా, తన పిల్లల ప్రాణాల కోసం ఎంతో సాహసం చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వీడియోను Sora Studio అనే యూట్యూబ్ ఛానల్ షేర్ చేసింది. ఈ అద్భుతమైన వీడియోను 65,009,215 మంది వీక్షించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పాముకు గుణపాఠం నేర్పిన తల్లి ప్రేమ, ‘ఆ తల్లి ప్రేమకు, ధైర్యానికి హ్యాట్సాప్’ అని కామెంట్లు పెడుతున్నారు.






