VIRAL: ఢిల్లీలో ఆసక్తికర దృశ్యం.. సీఎం రేవంత్‌, రోజా షేక్‌హ్యాండ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-18 13:49:19  IST  )

ఢిల్లీ పార్లమెంట్ భవనంలో సీఎం రేవంత్ రెడ్డి, వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా అనుకోకుండా ఎదురుపడ్డారు.

VIRAL: ఢిల్లీలో ఆసక్తికర దృశ్యం.. సీఎం రేవంత్‌, రోజా షేక్‌హ్యాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy)కి, ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా (RK Roja) ఊహించని విధంగా ఎదురుపడ్డారు. ఇవాళ పార్లమెంట్ భవన సముదాయంలో చోటుచేసుకున్న ఈ సన్నివేశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలను కలిసేందుకు పార్లమెంట్ భవనానికి వెళ్లారు. అదే సమయంలో, తన నియోజకవర్గ సమస్యలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసేందుకు రోజా కూడా అక్కడికి వచ్చారు. పార్లమెంట్ లాబీల్లో ఇరువురు నేతలు అనుకోకుండా ఎదురుపడ్డారు. రేవంత్‌ రెడ్డిని చూడగానే రోజా చిరునవ్వుతో పలకరించగా.. సీఎం రేవంత్ కూడా మర్యాదపూర్వకంగా స్పందించారు. ఇద్దరూ షేక్‌హ్యాండ్ ఇచ్చుకుని, ఒకరి యోగక్షేమాలు మరొకరు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వారు షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story