Viral: అంత పెద్ద పామును ఈజీగా పట్టేసింది.. మహిళ సాహసంపై ప్రశంసలు

by Ramesh Goud |   (  Updated:2024-07-29 11:09:41  IST  )

ఓ ప్రభుత్వ కార్యాలయంలో దూరిన పామును ఓ మహిళ సునాయాసంగా పట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Viral: అంత పెద్ద పామును ఈజీగా పట్టేసింది.. మహిళ సాహసంపై ప్రశంసలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓ ప్రభుత్వ కార్యాలయంలో దూరిన పామును ఓ మహిళ సునాయాసంగా పట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఆ మహిళపై సహాసంపై నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఓ ప్రభుత్వ కార్యాలయంలోకి పెద్ద పాము వచ్చింది. ఇది చూసిన అధికారులు భయంతో ఆఫీస్ ఖాళీ చేసి స్నేక్ రెస్క్యూ టీంకు ఫోన్ చేశారు. దీంతో రెస్క్యూ టీం సభ్యురాలు అయిన అజితా పాండే పామును రక్షించేందుకు అక్కడికి వచ్చారు. అక్కడ ఏమి జరగనట్టు సరదాగా కార్యాలయంలో వెళ్లి కంప్యూటర్ వెనుక ఉన్న పామును సునాయాసంగా పట్టుకోవడం చూసిన కార్యాలయ సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు.

ఆ పాము విషపూరితమైనదా అని ఓ కార్యాలయ సిబ్బంది అడిగినప్పుడు.. ఆమె చిరునవ్వుతో కాదని సమాధానం ఇచ్చింది. ఈ సంఘటనను ఓ వ్యక్తి చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. పామును పట్టుకునే సమయంలో ఆమె చూపిన విశ్వాసం, చురుకుదనంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె దైర్యసహసాలను మెచ్చుకుంటున్నారు. అంతేగాక మహిళలు దేంట్లో తక్కువ కాదని మరో మహిళ నిరూపించింది అంటు కామెంట్లు పెడుతున్నారు.

Next Story