ఇలా ఉన్నారేంట్రా.. కోల్‌కతా స్టేడియం వద్ద అభిమానుల హంగామా.. వీడియో వైరల్

by Ramesh Naini |

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‍కతా పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

ఇలా ఉన్నారేంట్రా.. కోల్‌కతా స్టేడియం వద్ద అభిమానుల హంగామా.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) కోల్‍కతా పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈవెంట్‌లో నిర్వహణ వైఫల్యం, మెస్సీ త్వరగా వెళ్లిపోవడంతో అభిమానులు ఆగ్రహానికి గురై స్టేడియంలోకి విధ్వంసం సృష్టించారు. మెస్సీ మ్యాచ్ ఆడుతారని, ఆ మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ తరలి వచ్చారు. కాగా, స్టేడియంకు వచ్చిన మెస్సీ త్వరగా వెళ్లిపోయారు. దీంతో.. స్టేడియంలో వేచి చూస్తున్న ప్రేక్షకులు ఆగ్రహానికి గురై హంగామా సృష్టించారు. బారికేడ్లు దాటుకొని గ్రౌండ్‌లోకి వందల మంది ఫ్యాన్స్ వచ్చి చెల్లాచెదురు చేశారు. కుర్చీలు విసిరారు.. ప్లెక్సీలు చించారు. టెంట్లు పారేశారు. మరోవైపు పోలీసులు, బలగాలు వారిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

కానీ ఆగ్రహంతో ఉన్న అభిమానలు స్టేడియం వద్ద ప్రవర్తించిన తీరు నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్ వీడియోల్లో.. ఓ వ్యక్తి ట్రాలీపై పడుకొని ఉంటాడు. మరోవ్యక్తి ఆ ట్రాలీని లాగుతూ గ్రౌండ్‌లో తిప్పుతూ ఎంజాయ్ చేస్తారు.. మరోవైపు ఫుట్‌బాల్ నెట్‌‌ను అభిమానులు పూర్తి ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్‌లు రకరకాలుగా స్పందించారు. ఇలా ఉన్నారేంట్రా బాబు మీరు అని నెటిజన్‌లు షాక్ అయ్యారు. మ్యాచ్ ఆడకపోతే డబ్బులు రీ ఫండ్ చేయించుకోవాలని, ఇలా స్టేడియంలో కనిపించిన ప్రతి వస్తువు ధ్వంసం చేయడం సరికాదని హితువు పలికారు. వీడియో ఇదే..

Next Story