- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pre-Wedding: క్రేజీ ప్రీ వెడ్డింగ్ షూట్! స్విమ్మింగ్ ఫూల్లో జంట రొమాన్స్ షూట్.. హద్దులు దాటి.. వీడియో వైరల్
జీవితంలో ఒకసారి మాత్రమే జరిగే వేడుక పెళ్లి కాబట్టి.. ఆ జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవడం కోసం పెళ్లి కాబోయే జంటలు ప్రీ వెడ్డింగ్ షూట్‌లను ఇష్టపడుతున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (Viral Videos) ప్రస్తుత కాలంలో (Pre Wedding Shoots) ప్రీ వెడ్డింగ్ షూట్‌ల హవా కొనసాగుతోంది. జీవితంలో ఒకసారి మాత్రమే జరిగే వేడుక పెళ్లి కాబట్టి.. ఆ జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవడం కోసం పెళ్లి కాబోయే జంటలు ప్రీ వెడ్డింగ్ షూట్‌లను ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలనే కొంతమంది కొత్త కొత్త ఆలోచనలతో సినిమాను మించి ప్రీ వెడ్డింగ్ షూట్‌లను తీయించుకుంటున్నారు. అందరి కంటే భిన్నంగా షూట్ చేయాలని.. శ్మశానాలు వంటి ప్రాంతాల్లో షూట్‌లు చేసిన ఘటనలు ఉన్నాయి. కొంత మంది సముద్రాలు, నదులు, కొండలు వంటి ప్రదేశాల్లో షూట్ చేయించుకుంటూ కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. బైక్‌లపై స్టంట్స్ చేస్తూ షూట్‌లు చేయించుకోని మరి కొందరూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.
ఇక, కపుల్స్ మధ్య కెమిస్ట్రీ ఉండాలని హద్దులు మీరిన కెమిస్ట్రీని చూపిస్తున్నారు. సెమీ న్యూడ్‌గా ఉండే ఫ్రి వెడ్డింగ్ షూట్స్ సైతం కొందరు తీసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోలు, ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ జంట క్రేజీ ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో చూపించిన ప్రకారం.. ఒక జంట స్విమ్మింగ్ ఫూల్లో రొమాన్స్ చేస్తున్నట్లుగా ఉంటుంది. కపుల్స్ ఇద్దరు స్విమ్ సూట్‌లో ఉంటారు. అబ్బాయి అమ్మాయికి కిస్ చేస్తూ రొమాన్స్ చేస్తుంటాడు. హద్దులు మీరిన కెమిస్ట్రీని ఇద్దరి మధ్య చూపించే ప్రయత్నం చేస్తారు.
ఇక ఈ తతంగం అంతా కెమెరామెన్ నీటి లోపల నుంచి.. బయట నుంచి క్రియేటివ్‌గా షూట్ చేసే ప్రయత్నం చేస్తారు. పెళ్లి కాకముందే ప్రి వెడ్డింగ్ షూట్ పేరుతో ఫస్ట్ నైట్ కూడా చేస్తారేమో..? అని ఓ ఎక్స్ యూజర్ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. రాను రాను ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో మరింత దిగజారిపోయేలా ఉన్నారని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జంట తమిళనాడుకు చెందిన వారిగా ఓ యూజర్ స్పష్టం చేశారు.






