- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హెయిర్ డై వాడిన 20 ఏళ్ల అమ్మాయికి కిడ్నీ డ్యామేజ్..
చైనాకు చెందిన 20ఏళ్ల అమ్మాయి ప్రతీ నెల హెయిర్ డై వాడుతుండటంతో కిడ్నీ వ్యాధి వచ్చినట్లు తెలిపారు వైద్యులు. కె-పాప్ డ్రామాను ఫాలో అవుతున్న ఆమె.. కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ ట్రై చేసేందుకు హెయిర్ డైయింగ్ చేస్తూ ఉండేది. ఈ అలవాటు

దిశ, వెబ్ డెస్క్ : చైనాకు చెందిన 20ఏళ్ల అమ్మాయి ప్రతీ నెల హెయిర్ డై వాడుతుండటంతో కిడ్నీ వ్యాధి వచ్చినట్లు తెలిపారు వైద్యులు. కె-పాప్ డ్రామాను ఫాలో అవుతున్న ఆమె.. కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ ట్రై చేసేందుకు హెయిర్ డైయింగ్ చేస్తూ ఉండేది. ఈ అలవాటు తల ద్వారా విషపూరిత రసాయనాలు శోషించేందుకు కారణమై చివరకు దీర్ఘకాలిక కిడ్నీ డ్యామేజ్‌కు దారితీసింది. ముందుగా ఆమెకు తలనొప్పి స్టార్ట్ కాగా ఆ తర్వాత కాళ్లపై ఎర్రటి మచ్చలు, జాయింట్ పెయిన్, కడుపు నొప్పి రావడంతో డాక్టర్లను ఆశ్రయించింది. ఈ లక్షణాలను గమనించిన వైద్యులు.. కెమికల్ ఎక్స్‌పోజర్ వల్ల వచ్చిన యాక్యూట్ ఇంటర్‌స్టీషియల్ నెప్రైటిస్‌తో లింక్ చేశారు. తలలోని పోరస్ స్కిన్ ద్వారా రక్తంలోకి ప్రవేశించిన టాక్సిన్స్ స్థాయిల్ పెరగ్గా.. ఈ పరస్థితి రెనలక ఫెయిల్యూర్‌కు దారితీసే స్థాయికి చేరింది.
కాగా హెయిర్ డై పారా-ఫెనిలెన్‌డైయామిన్ (PPD) అనే రసాయనాన్నికలిగి ఉంటుంది. ఇది పదేపదే ఉపయోగించడం వల్ల అలర్జిక్ రియాక్షన్స్, ఆర్గాన్ డ్యామేజ్‌కు కారణమవుతుంది. టాక్సిన్స్‌లో లెడ్, మెర్క్యురీ వంటి హెవీ మెటల్స్ ఉంటాయి. తరుచుగా వాడితే హెయిర్‌పై సులభంగా శోషించబడతాయి. కాగా PPDకు దీర్ఘకాలిక ఎక్స్‌పోజర్ ఉన్న మహిళలపై జరిగిన అధ్యయనం... చిరోస్ట్ కిడ్నీ డిసీజ్ (CKD)తో గణనీయమైన సంబంధాన్ని గుర్తించింది.అందుకే నిపుణులు హెయిర్ డైయింగ్‌ను 8 వారాలకు ఒకసారి మాత్రమే పరిమితం చేయాలని. అమ్మోనియా-ఫ్రీ, నేచురల్ ఆల్టర్నేటివ్స్‌ను ఎంచుకోవాలని, సెన్సిటివిటీలను నివారించడానికి ప్యాచ్ టెస్టులు చేయాలని సిఫార్సు చేస్తున్నారు.






